వసంత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వసంత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

devi kshemama song lyrics in telugu | shanti nilayam movie lyircs in telugu |

దేవీ క్షేమమా.. శాంతి నిలయం 

చిత్రం : శాంతి నిలయం (1972)
సంగీతం : ఎస్. పి. కోదండపాణి
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : వసంత, బాలు 

పల్లవి:
అతడు: దేవీ క్షేమమా.. 
ఆమె: దేవరవారూ క్షేమమా
అతడు: దేవీ క్షేమమా.. 
ఆమె: దేవరవారూ క్షేమమా
అతడుతమ కడగంటి చూపే కరువైనాదీ

ఆమె 
తమ కరుణా కటాక్షమే అరుదైనాదీ.. 

అతడు
దేవీ క్షేమమా.. ఆ..ఆ..ఆ   

చరణం1:
అతడు
నులి సిగ్గుల లేబుగ్గలు ఎలాగున్నవీ?

ఆమె
నులి వెచ్చని తొలి ముద్దులు పంపమన్నవీ

అతడు
నులి సిగ్గుల లేబుగ్గలు ఎలాగున్నవీ?

ఆమె
నులి వెచ్చని తొలి ముద్దులు పంపమన్నవీ

అతడు
అల్లరల్లరీ కళ్ళు చల్లగా వున్నవా?
అల్లరల్లరీ కళ్ళు చల్లగా వున్నవా?

ఆమె
తెల్లవార్లు నిదుర రాక ఎర్రబారుతున్నవీ..  

అతడు
దేవీ క్షేమమా.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
  
చరణం2 :
ఆమె
జడలోన మల్లెపూలు ఇమడకున్నవి

అతడు
జత లేక పట్టుపరుపు కుదరకున్నది

ఆమె
జడలోన మల్లెపూలు ఇమడకున్నవి

అతడు
జత లేక పట్టుపరుపు కుదరకున్నది
తలగడతో చెప్పుకునే 
కబురులే మిగిలినవి
తలగడతో చెప్పుకునే 
కబురులే మిగిలినవి

ఆమె
అవి కూడ నలిగిపోయి జాలివేస్తున్నది..  

అతడు
దేవీ క్షేమమా.. ఆ.. ఆ.. ఆ.. ఆ

చరణం3:
అతడు
నీ బడిలో చదవాలి 
క్రొత్త క్రొత్త చదువులూ

ఆమె
నేనపుడు అడగాలి 
చిలిపి చిలిపి ప్రశ్నలూ

అతడు
నీ పెదవులపై వ్రాయాలి 
నీవుమెచ్చు జవాబులూ
పెదవులపై వ్రాయాలి 
నీవుమెచ్చు జవాబులూ

ఆమె
నీ మగసిరి గెలవాలి 
అసలైన పరీక్షలూ 

అతడు
దేవీ క్షేమమా.. 
ఆమె
దేవరవారూ క్షేమమా..

అతడు 
దేవీ క్షేమమా..