సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గానం: బాలు , పి. సుశీల
సాహిత్యం: సి. నారాయణరెడ్డి
పల్లవి:
ఆమె
ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకూ
ఎన్నెల్లు తిరిగొచ్చే మా కళ్ళకూ
ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకూ
ఎన్నెల్లు తిరిగొచ్చే మా కళ్ళకూ
బరువంక పిలిచింది తిరనాళ్ళకు
నెలవంక పొడిచింది సాన్నాళ్ళకు
ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకూ
ఎన్నెల్లు తిరిగొచ్చే మా కళ్ళకూ
చరణం1:
ఆమె
యన్న చెలికే మనసు
వెన్నే లొలికే సొగసు
యన్న చెలికే మనసు
వెన్నే లొలికే సొగసు
కదిలొచ్చే కానుకలు ఉయ్యాలో
కనుమంత పండుగలు ఇయ్యాలో
వంక జాబిలి నవ్వు
వాలు చూపులు రువ్వు
వంక జాబిలి నవ్వు
వాలు చూపులు రువ్వు
వెన్నెలలాడి దరిగొస్తే ఉయ్యాలో
కన్నెలేడి గంతులేసె ఇయ్యాలో
చరణం 2:
అతడు
ముద్దుల గుమ్మ కులికే
మువ్వల బొమ్మ పలికే
ముద్దుల గుమ్మ కులికే
మువ్వల బొమ్మ పలికే
పగలే వెన్నెల కాసే
పలుకే తేనెలు కురిసే
ఆమె
మా రాముడు వస్తుంటే
ఉయ్యాలో ఉయ్యాలో
కోరస్: ఉయ్యాలో ఉయ్యాలో
మా నోములే పండే
ఇయ్యాలో ఇయ్యాలో
కోరస్: ఇయ్యాలో ఇయ్యాలో
అ: హహ హ ఆ: హహ
అ: హహ హ ఆ: హహ
అ: హహ హ ఆ: హహ
అ: హహ హ ఆ: హహ
ఆమె
ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకూ
ఎన్నెల్లు తిరిగొచ్చే మా కళ్ళకూ
చరణం 3:
అతడు
రెమ్మ కొమ్మ రేపు మాకు
జుమ్మని పాడే ఏలేలో
ఏలేలో ఏలేలో
కోరస్: ఏలేలో ఏలేలో
ఆమె
కమ్మని తేనెలు తెమ్మని పడే
తుమ్మెదలాడే వాలాల్లో
వాలాల్లో వాలాల్లో
కోరస్: వాలాల్లో వాలాల్లో
అతడు
కొండ పలికే కోన పలికే
గుండె పలికే ఏలేలో
ఏలేలో ఏలేలో
ఏలేలో ఏలేలో
ఆమె
కొండను నీవై కొనకు వచ్చే
పండగ సందడి కొలలో
కొలలో కొలలో
కొలలో కొలలో
అతడు
పారే ఏటికి నీరు పండగ
పాడే నోటికి పాట పండగ
మీ పాటలే ఈ పూట పండగ
ఆమె
మీ పాటలో మా బ్రతుకు పండగ
ఆహ ఆ హ, ఆహ ఆ హ
ఆహ ఆ హ, ఓహొ ఓ హొ
ఇద్దరు
ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకూ
ఎన్నెల్లు తిరిగొచ్చే మా కళ్ళకూ
