విడిదిలోనికి
Presented By : Jodu Rama SathyanarayanaLyrics : Sai Prasad poojariMusic : Madeen SKSinger : Prabha, Srinidhi, Mamatha Ramesh, Lavanya
మూడు వేలిస్తాం మొద్దు పిల్లనిస్తాంరావయ్య పెళ్ళికొడుకా విడిదిలోనికిమూడు వేలక్కర్లేదు మొద్దు పిల్లక్కర్లేదురామండి మావయ్య గారు విడిదిలోనికిమొద్దు పిల్లతో పాటు ముద్దోటి ఉంగరం ఇస్తాంరావయ్య పెళ్ళికొడుకా విడిదిలోనికిమొద్దు పిల్లక్కర్లేదుముద్దోటి ఉంగరం అక్కర్లేదురామండి మావయ్య గారు విడిదిలోనికిమూడు వేలిస్తాం మొద్దు పిల్లనిస్తాంరావయ్య పెళ్ళికొడుకా విడిదిలోనికి
మూడు వేలిస్తాం మొద్దు పిల్లనిస్తాం
రావయ్య పెళ్ళికొడుకా విడిదిలోనికి
మూడు వేలక్కర్లేదు మొద్దు పిల్లక్కర్లేదు
రామండి మావయ్య గారు విడిదిలోనికి
మొద్దు పిల్లతో పాటు ముద్దోటి ఉంగరం ఇస్తాం
రావయ్య పెళ్ళికొడుకా విడిదిలోనికి
మొద్దు పిల్లక్కర్లేదు
ముద్దోటి ఉంగరం అక్కర్లేదు
రామండి మావయ్య గారు విడిదిలోనికి
మూడు వేలిస్తాం మొద్దు పిల్లనిస్తాం
రావయ్య పెళ్ళికొడుకా విడిదిలోనికి
చరణం 1:
నాలుగు వేలిస్తాం నల్ల పిల్లనిస్తాం
రావయ్య పెళ్ళికొడుకా విడిదిలోనికి
నాలుగు వేలక్కర్లేదు నల్ల పిల్లక్కర్లేదు
రామండి మావయ్య గారు విడిదిలోనికి
నల్ల పిల్లతో పాటు నిమ్మ తోటలు ఇస్తాం
రావయ్య పెళ్ళికొడుకా విడిదిలోనికి
నల్ల పిల్లక్కర్లేదు నిమ్మ తోటలక్కర్లేదు
రామండి మావయ్య గారు విడిదిలోనికి
చరణం 2:
అయిదు వేలిస్తాం అల్లరి పిల్లనిస్తాం
రావయ్య పెళ్ళికొడుకా విడిదిలోనికి
అయిదు వేలక్కర్లేదు అల్లరి పిల్లక్కర్లేదు
రామండి మావయ్య గారు విడిదిలోనికి
అల్లరి పిల్లతో పాటు అద్దాల మేడలిస్తాం
రావయ్య పెళ్ళికొడుకా విడిదిలోనికి
అల్లరి పిల్లక్కర్లేదు అద్దాల మేడక్కర్లేదు
రామండి మావయ్య గారు విడిదిలోనికి
చరణం 3:
ఆరు వేలిస్తాం అలిగే పిల్లనిస్తాం
రావయ్య పెళ్ళికొడుకా విడిదిలోనికి
ఆరు వేలక్కర్లేదు అలిగే పిల్లక్కర్లేదు
రామండి మావయ్య గారు విడిదిలోనికి
అలిగే పిల్లతో పాటు అరటి తోటలు ఇస్తాం
రావయ్య పెళ్ళికొడుకా విడిదిలోనికి
అలిగే పిల్లక్కర్లేదు అరటి తోటలక్కర్లేదు
రామండి మావయ్య గారు విడిదిలోనికి
చరణం 4:
ఏడు వేలిస్తాం ఎడ్డి పిల్లనిస్తాం
రావయ్య పెళ్ళికొడుకా విడిదిలోనికి
ఏడు వేలక్కర్లేదు ఎడ్డి పిల్లక్కర్లేదు
రామండి మావయ్య గారు విడిదిలోనికి
ఎడ్డి పిల్లతో పాటు ఎద్దుల బండి ఇస్తాం
రావయ్య పెళ్ళికొడుకా విడిదిలోనికి
ఎడ్డి పిల్లక్కర్లేదు ఎద్దుల బండక్కర్లేదు
రామండి మావయ్య గారు విడిదిలోనికి
చరణం 5:
ఎనిమిది వేలిస్తాం ఎర్ర పిల్లనిస్తాం
రావయ్య పెళ్ళికొడుకా విడిదిలోనికి
ఎనిమిది వేలక్కర్లేదు ఎర్ర పిల్లక్కర్లేదు
రామండి మావయ్య గారు విడిదిలోనికి
ఎర్ర పిల్లతో పాటు ఇత్తడి గిన్నెలు ఇస్తాం
రావయ్య పెళ్ళికొడుకా విడిదిలోనికి
ఎర్ర పిల్లక్కర్లేదు ఇత్తడి గిన్నెలక్కర్లేదు
రామండి మావయ్య గారు విడిదిలోనికి
చరణం 6:
తొమ్మిది వేలిస్తాం తెల్ల పిల్లనిస్తాం
రావయ్య పెళ్ళికొడుకా విడిదిలోనికి
తొమ్మిది వేలక్కర్లేదు తెల్ల పిల్లక్కర్లేదు
రామండి మావయ్య గారు విడిదిలోనికి
తెల్ల పిల్లతో పాటు త్రొక్కుడు బండి ఇస్తాం
రావయ్య పెళ్ళికొడుకా విడిదిలోనికి
తెల్ల పిల్లక్కర్లేదు త్రొక్కుడు బండక్కర్లేదు
రామండి మావయ్య గారు విడిదిలోనికి
చరణం 7:
పది వేలిస్తాం పొట్టి పిల్లనిస్తాం
రావయ్య పెళ్ళికొడుకా విడిదిలోనికి
పది వేలక్కర్లేదు పొట్టి పిల్లక్కర్లేదు
రామండి మావయ్య గారు విడిదిలోనికి
పొట్టి పిల్లతో పాటు పట్టి మంచాలు ఇస్తాం
రావయ్య పెళ్ళికొడుకా విడిదిలోనికి
పొట్టి పిల్లక్కర్లేదు పట్టి మంచాలక్కర్లేదు
రామండి మావయ్య గారు విడిదిలోనికి
ఇక లక్ష కోట్లిస్తాం మా పిల్లనిస్తాం
రావయ్య పెళ్ళికొడుకా విడిదిలోనికి
ఓహో లక్ష కోట్లు అక్కర్లేదు మీ పిల్లనిస్తే చాలు
వస్తామండి మావయ్య గారు విడిదిలోనికి
మేము వస్తామండి మావయ్య గారు విడిదిలోనికి
మేము వస్తామండి మావయ్య గారు విడిదిలోనికి
.jpg)
0 కామెంట్‌లు