రాజమ్మ విడిసిపోయింది రో
Music Composer: Vijai Bulganin
Lyricist: Chandrabose
Singer: Ram Miryala
Choreographer: Suneel Sunnapu & Phalguni Bangera
పల్లవి:
రాజమ్మ విడిసిపోయింది రో
రాజమ్మ పొడిసిపోయింది రో
నన్నింకా మరిసిపోయింది రో..
నా గుండె విడిసిపోయింది రో
అవ్వా అయ్యని పని పాటని
పక్కన పెట్టి పక్కనే ఉంటే
కేర్ చేయక నన్నే దేఖక పోయె రాజమ్మ
పోయె రాజమ్మ
అమ్మో రాజమ్మ విడిసి పోయిందిరో..
వామ్మో రాజమ్మో పొడిసి పోయిందిరో
గంగ లోపల చేప పిల్లొలే
ప్రేమలో నేను గంతులేస్తుంటే
గట్టు మీద గిసిరికొట్టి పోయె రాజమ్మ..
పోయె రాజమ్మ
అమ్మో రాజమ్మో విడిసి పోయిందిరో..
వామ్మో రాజమ్మో పొడిచిపోయిందిరో
చరణం 1:
దెబ్బలు తిన్నా దిల్ దార్ నేమో..
అందరికన్నా దర్కార్ నేను
హిసంటియన్నో చూసినా మస్తు..
అరె ఫికర్ జేయ్య మీసం ఎత్తు
లొందలోన్న పొందాలోన్న నేనే పోయే సడక్
అరె ఆగకుండా పోతా ఉంటా
నాకేం పడదు ఫరక్
ఇచ్చేటోళ్ళు ఇస్తుంటారు గడికోక జర్క్..
చచ్చిపోయే కర్మం లేదు చేసుకుందాం వర్క్
రాజమ్మ విడిసి పోయింది రో..
రాజమ్మ పొడిసి పోయింది రో
నన్నింకా మరిసి పోయింది రో..
నా గుండె విడిసి పోయింది రో
చరణం 2:
లలలలల లలలల లాల
లలలలల లలలల లాల
పేల దయ్యముంది ప్రేమలోన..
నవ్వుతుంటా తుళ్ళుతుంటా
తాగుతుంటా తిరుగుతుంటా..
ఎగురుతుంటా దుముకుతుంటా
ఏమైపోయింది బతుకులోన..
మూడు పూట్లా మెక్కుతుంటా
మొద్దులెక్క పండుకుంటా..
ముందు కన్నా ముదురుతుంటా
కోడిని కోస్తానే ఓ సుమ్మక్క..
బెల్లం తెస్తానే ఓ సారక్క
పుట్టెడు సంబరమే ఈడుందక్క..
ఎప్పుడూ ఇట్లానే జర చూడక్క
నమ్మకంగా నిమ్మలంగా చెప్తున్నాను నేను
నీ జిందగీకి నువ్వేగాక
జిమ్మేదారు కౌను
నీ సంతోషం నీ చేతుల్లో ఉండాలంటున్నాను
పోరి మీదో ప్రేమ మీదో పెట్టద్దంటున్నాను
లలల లలలలలల
లలల లలలలలల
లలల లలలలలల
ఓ రాజమ్మ.. ఓ రాజమ్మ..
ఓ రాజమ్మ.. ఓ రాజమ్మ

0 కామెంట్‌లు