చిత్రం : శీను వాసంతి లక్ష్మి
సంగీతం : ఆర్పీ పట్నాయక్
రచన : కులశేఖర్
గానం : పట్నాయక్, నిహాల్
సంగీతం : ఆర్పీ పట్నాయక్
రచన : కులశేఖర్
గానం : పట్నాయక్, నిహాల్
నిహాల్
పాడనా శిలను కరిగించు గీతం
పరమేశ్వరుడే ఇలకేతెంచి
పులకించి నర్తించు నవనాట్య వేదం
పట్నాయక్
పాడనా మదిని మురిపించు గీతం
స్వర మాధురిలో మనసే నెమలై
పురివిప్పి ఆడేటి ఆనంద గీతం
నిహాల్
పాడనా..
నారద ప్రణిపాతం
స్వర భారతి పద పీఠం
ఓంకార నాదాల
నిగమార్థ సారం.. సంగీతం
పట్నాయక్
వెన్నెల జలపాతం
మరుమల్లెల మణిదీపం
స్వరరాగ రసయోగ
గంగా ప్రవాహం.. సంగీతం
నిహాల్
దిగంతాల శృతి సుగంధాలు
వెదజల్లును సంగీతం
పాడనా శిలను కరిగించు గీతం
పట్నాయక్
స్వర మాధురిలో మనసే నెమలై
పురివిప్పి ఆడేటి ఆనంద గీతం
నిహాల్
స నిస దనిస మదనిస
గమదనిస సగమదనిస
ససనినిద నినిదదమ
గసగసని సనిదనిదమదని
గమదనిస
తుంబురు వరదానం
తుహి నాచల పరిధానం
మందార మకరంద
మాధుర్య పానం.. నా గానం
పట్నాయక్
తుమ్మెద ఝంకారం
నా పాటకి శ్రీకారం
పరువాల పరవళ్ల
సెలయేటి వేదం.. నా రాగం
నిహాల్
కళాభారతికి కశాఘాతమిది
ఏమిర నీ గీతం
పట్నాయక్
పాడనా మదిని మురిపించు గీతం
స్వర మాధురిలో
మనసే నెమలై
పురివిప్పి ఆడేటి ఆనంద గీతం
నిహాల్
నాదబ్రహ్మ గురు త్యాగరాజ
కృత పంచరత్నముల
కించుమించు సరిసాటియైన
మమ గాన వాహినికి
మంజుల మార్దవ మానస
గీతికి ఊపిరులాడక స్వరములు తోచక
తికమక పడిపడి పదములు
తడబడి శృతి తప్పి మతిపోవు పసివాడవు
జన్య జనకాల ధన్య గమకాల
నా మూర్ఛ నలకింప మూర్చిల్లి పోతావు
పాడనా.. పాడనా..
పట్నాయక్
గలగలా పారే సెలయేరమ్మా
సరిగామాలంటే నేర్పింది
కిలకిలా పాడే ప్రతి గువ్వమ్మా
గమకములంటే చూపింది
అమ్మ పాటలో లాలి లాలన..
చిన్ని పాపలో హాయి భావన
గాలి తరగాలో గాన మధురిమ..
పేద వెదురులో ప్రాణ స్పందన
కడలి అలల కమనీయ కీర్తన..
పుడమి ఎదను చినుకమ్మ నర్తన
సుప్రభాత సుమరాగ రంజన..
సూర్యదేవ కిరణాల దీవెన
వేద మంత్రముల నాద ఘోషణ..
కాగితాలలో కావ్య వేదన
గుండె గూటిలో వాయులీనమై..
కంటి పాపలో స్వప్న రాగమై
గాన పదమ్మున నను నడిపించే
జానపదమ్ముల జాను తెలుగు
తొలి పాట తల్లి నా జ్యోతలందుకుని
పొంగిపోగా...
పాడనా మదిని
మురిపించు గీతమ్..

0 కామెంట్‌లు