Album/Movie: Mondi Mogudu Penki Pellam
Artist Name: Suman,Vijayashanthi
Singer: M.M. Keeravaani,M.M. Sreelekha
Music Director: M.M. Keeravaani
Lyricist: Veturi Sundararama Murthy
అతడు
నాటకాల జగతిలో జాతకాల జావళి
కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలి
నీటిలో తారా ఉండదు
నింగిలో చేపా ఉండదు
నీటికి నీరే పుట్టదు
నీకు ఈ బాధే తప్పదు
నీరంతా కడిగేస్తున్నా
అది చూసి లోకం
విసిరేస్తే గాలం
గాలైనా కాపాడేనా
విలువ బలైనా జన్మకు శిలువ పడేనా
విధికి గులామై ధర్మం తలవంచేనా
చేలైనా మేసేటి కంచెలివేలే
ఆమె
నాటకాల జగతిలో జాతకాల జావళి
కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలి
నీటిలో తారా ఉండదు
నింగిలో చేపా ఉండదు
నీటికి నీరే పుట్టదు
నీకు ఈ బాధే తప్పదు
అతడు
అందాల చెల్లి తన చంటి తల్లి
మానాలు మసిబారేనా
ఓణీకి రాని ఓ ఆడ ప్రాణి
సింగాల కసి చూసేనా
నరకమనేది ఇంటికి ముందు వసారా
శునకమనేది భర్తకు మిగిలిన పేరా
దెయ్యాలు వేదాలు పాడిన వేళ
నాటకాల జగతిలో జాతకాల జావళి
కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలి
నీటిలో తారా ఉండదు
నింగిలో చేపా ఉండదు
నీటికి నీరే పుట్టదు
నీకు ఈ బాధే తప్పదు
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.
----------END----------

0 కామెంట్‌లు