సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: గుంటూరు శేషంధ్రశర్మ
నేపధ్య గానం: సుశీల
నిదురించే తోటలోకి
పాట ఒకటి వచ్చిందీ..
కన్నుల్లో నీరు తుడిచీ
కమ్మటి కల ఇచ్చింది
నిదురించే తోటలోకి
పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచీ
కమ్మటి కల ఇచ్చింది
రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ..
దీనురాలి గూ..టిలోన
దీపంగా వెలిగింది
రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ..
దీనురాలి గూ..టిలోన
దీపంగా వెలిగింది
శూన్యమైన వేణువులో
ఒక స్వరం కలిపి నిలిపిందీ
శూన్యమైన వేణువులో
ఒక స్వరం కలిపి నిలిపిందీ
ఆకురాలు అడవికి ఒక
ఆమని దయ చేసింది
నిదురించే తోటలోకి
పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచీ
కమ్మటి కల ఇచ్చింది
విఫలమైన నా కోర్కెలు
వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడీ
అంతలో పోయాయి
విఫలమైన నా కోర్కెలు
వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడీ
అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా
గగనంలో మబ్బుల్లారా
నది దోచుకుపోతున్న నావను ఆపండి
రేవు బావురు మంటోందని..
నావకు చెప్పండీ
నావకు చెప్పండి

0 కామెంట్‌లు