Lyrics: Suresh Kadari
Music: Krishnudu
Singer: Hanmanth Yadav

పల్లవి (Pallavi):
సీత లేని రాముడినయ్యానా 
నువ్వు లేక నాతోనా
రాధ లేని కృష్ణుడినయ్యానా 
పాడు రాత నాదేనా
ఏ పాపం చేసానో 
నువ్వు దూరమాయేనా
ఏ నేరం చేసానో 
కన్నీరే మిగిలేనా
మూడు ముళ్ళు వేయక 
ముందే నూరేళ్లు నిండేనా
ఏలు పట్టి నడవక ముందే 
నన్ను వీడి పోయేనా
సీత లేని రాముడినయ్యానా 
నువ్వు లేక నాతోనా
రాధ లేని కృష్ణుడినయ్యానా 
పాడు రాత నాదేనా

చరణం 1 (Charanam 1):
నా సీత ఎట్లుండనే 
నువ్వు తోడు లేక ఈ మందీలా
నా రాత పాడుగానే 
కాలి బూడిదైతా నీ కాటిలా
నా రాధ ఎటుబోదునే 
నిన్ను దాచుకోని నా గుండెలా
ఈ బాధ మోయలేనే 
నేను కలిసిపోతా ఈ మన్నులా
ఎందరు ఉన్నా 
నువ్వే లేని లోటే నాకు ఉన్నదే
నిన్ను మరిచిపోనన్నదే 
గుండె కన్నీరవుతున్నదే
సీత లేని రాముడినయ్యానా 
నువ్వు లేక నాతోనా
రాధ లేని కృష్ణుడినయ్యానా 
పాడు రాత నాదేనా

చరణం 2 (Charanam 2):
అగ్గి దేవుని సాక్షిగా 
నీకు మూడుముళ్ళే కడతనే
నెత్తుటి ధారలతో 
నీకు సింధూరాన్నే పెడతనే
నా చేతుల్లో ఎత్తుకొని 
నీతో ఏడు అడుగులు వేస్తానే
గుండెపై ఉంచుకొని 
నీ చావులో నీ తోడు వస్తానే
ఎన్నెన్ని జన్మలకైనా 
నువ్వే నా సీత అవ్వాలిలే
నేనే రాముడినౌతానులే 
నీ తోడు నీడై ఉంటానులే
సీత లేని రాముడినయ్యానా 
సీత తోడు నీడై నే పోనా
రాధ లేని కృష్ణుడినయ్యానా 
రాత రాసి మళ్లీ నే రానా