అన్నా అన్నా అన్నాఅన్నా
చిత్రం: పుట్టింటికి రా చెల్లి (2014)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: శ్రీహర్ష
గానం: ఎస్.పి.బాలు,చిత్ర
ఆమె
అన్నా అన్నా అన్నాఅన్నా
అతడు
పుట్టింటికి రావే చెల్లి
పిలిచింది మన ఇంటి తల్లి
పుట్టింటికి రావే చెల్లి
పిలిచింది మన ఇంటి తల్లి.
అత్తింట్లో కడతేరాల ఆడదాని రాత
అన్నలేడు కాబట్టిగా అడవికెళ్లే సీత
ఆమె
తలరాతే గా నన్ను చేర్చెను నరకం
చెడు నిందను మాపేసి వస్తే న్యాయం
అతడు
పుట్టింటికి రావే చెల్లి
పిలిచింది మన ఇంటి తల్లి
అతడు
వేసవికైనా నీడుంది
ఓర్పుకు అయినా హద్దుంది
పాపం పెరిగితే భూదేవైనా
కంపించ కుంటుందా
ఆమె
చీర సారె సిరులిచ్చి
మెట్టిన ఇంటికి నన్నిస్తే
పుట్టెడు నిందలు కొంగున కట్టుకు
పుట్టింటికి వచ్చేదా
అతడు
కాపుకాయనే లేనా కనుల దాచుకొనా
ఆమె
తప్పుతోటి రానన్నా నిప్పులాగా వస్తా
ఎన్ని జన్మలైనా నీకు చెల్లినవుతాను
అతడు
పేగు అదురుతోందమ్మ
ప్రాణమనుకు తోందమ్మ
పుట్టింటికి రామ్మా చెల్లమ్మ
పుట్టింటికి రావే చెల్లి
పిలిచింది మన ఇంటి తల్లి
అతడు
కట్టిన తాలే కాదన్న
ఈ కాకుల లోకం ఏమన్నా
మెట్టిన నరకం మంటలోంచి
పుట్టింటి స్వర్గానికి రా
ఆమె
ప్రేమే అంతటి విలువైంది
పుట్టిన ఇల్లే చలువైంది
తప్పని అరిచే ఈ ఆచారం
ఎంతెంతో ఇరుకైంది
అతడు
అన్న నీడ కాదంటూ
బలిపశువవుతావా
ఆమె
గుండె పైన రాయల్లే
బరువు పెంచరావా
అతడు
నింగిలాగ నేనున్నా
ఉరుము భయము నీకొద్దు
ఆమె
ఉరుము తరుము కొస్తున్నా
దాడుపు నాకు ఇకలేదు
అతడు
పుట్టింటికి రామ్మా చెల్లమ్మ
పుట్టింటికి రావే చెల్లి ఇ
పిలిచింది మన ఇంటి తల్లి
అత్తింట్లో కడతేరాల ఆడదాని రాత
అన్నలేడు కాబట్టిగా అడలికెళ్లే సీత
ఆమె
తలరాతే గా నన్ను చేర్చెను
నరకం చెడు నిందను మాపేసి
వస్తే న్యాయం
అతడు
పుట్టింటికి రావే
చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి

0 కామెంట్‌లు