మధురం వాడి జత మధురం
సినిమా: సతీ లీలావతి
సంగీతం: మిక్కీ జె. మేయర్
గానం: కార్తీక్, చారులత మణి
నటీనటులు: దేవ్ మోహన్, లావణ్య త్రిపాఠి
పల్లవి:
ఇన్నాళ్ళీ పరిచయాన్ని నువ్వూహించావా?
నీలో ఏం జరుగుతోందో గమనిస్తున్నావా?
ఏముందో వాడిలోన తెలిసే లోగానే
గుండెల్లో చోటు కాస్త పంచేస్తున్నావా?
ఒక్కో క్షణమూ వింత..
చూస్తున్నావా తన చెంత
అంతాందంగా మారిందా నీకీ జగమంతా..
కళ్ళూ రెండూ కలిశాక ఉన్నట్టుండి మనసంతా
తుళ్ళి తుళ్ళి పడుతోందా నిన్నే నువ్వే మరిచేంత!
మధురం వాడి జత మధురం..
మధురంలే తలపే మధురం
మధువొలికే నీ కల మధురం..
మది మధురం!
మధురం వాడి జత మధురం..
మధురంలే తలపే మధురం
మధువొలికే నీ కల మధురం..
మది మధురం!
ఇన్నాళ్ళీ పరిచయాన్ని నువ్వూహించావా?
నీలో ఏం జరుగుతోందో గమనిస్తున్నావా?
ఏముందో వాడిలోన తెలిసే లోగానే
గుండెల్లో చోటు కాస్త పంచేస్తున్నావా?
చరణం:
ఇది వరకు ఉరికిన ఈ సమయం
నేడు విసిగిస్తోందా?
తన కొరకు వేచే నీ హృదయం
ఆగనంటోందా?
కనుల ముందు వాడిని చూస్తూనే
గంతులే వేస్తోంది
నిన్ను నడిపించే నమ్మకము వాడే
నీ బలము నీకే తెలిపే సాటిలేని సరిజోడే..
కళ్ళూ రెండూ కలిశాక ఉన్నట్టుండి మనసంతా
తుళ్ళి తుళ్ళి పడుతోందా నిన్నే నువ్వే మరిచేంత!
మధురం వాడి జత మధురం..
మధురంలే తలపే మధురం
మధువొలికే నీ కల మధురం..
మది మధురం!
మధురం వాడి జత మధురం..
మధురంలే తలపే మధురం
మధువొలికే నీ కల మధురం..
మది మధురం!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి