చిత్రం: నాయుడు గారి కుటుంబం (1996)
నటీనటులు: సుమన్,సంఘవి,కృష్ణంరాజు
Movie Title:-Nayudu Gaari Kutumbam
Cast Crew:-Suman, Sanghavi, Krishnam Raju
Music:-Koti
Director:-Boina Subba Rao
Language:-Telugu
Year:-1996
అతడు:
నీ వయస్సుకో నమస్సు నిత్యమల్లికా
ఆమె:
నా మనస్సులో ఉషస్సు నవ్యగీతికా
అతడు: తేనెలా తీయగా
ఆమె: దాయని పాడగా
అతడు:
మనసంతా రాగవనం
క్షణంక్షణం రసార్పణం
ఆమె: అవునా
అతడు:
నీ వయస్సుకో నమస్సు నిత్యమల్లికా
ఆమె:
నా మనస్సులో ఉషస్సు నవ్యగీతికా
అతడు:
అంచులు దాటే అలజడిలోనా
తనువులు రెండు తడబడగా
ఆమె:
యెదలను మీటే మదురిమలన్నీ
ఎదురై తానే అడుగిడగా
అతడు:
వలచిన గారకండ నీ వసంతమై
ఆమె:
నిలిచిన ప్రేమబంధమే సుఖాంతమై
అతడు:
అందాలన్నీ సిందూరాలై ఆవరించగా
ఆమె:
మలిసంధ్యలోన అందుకున్న
మరుల విరుల కానుక
అతడు: అవునా
ఆమె:
నా మనస్సులో ఉషస్సు నవ్యగీతికా
అతడు:
నీ వయస్సుకో నమస్సు నిత్యమల్లికా
ఆమె:
మంచై రాలే మౌనం తానే
మంజుల గానం తలపెడితే
అతడు:
కొంటెగ లేచే కోరికలన్నీ
కౌగిలి కోసం కలబడితే
ఆమె:
ఎగిసిన వింత సంబరం విహంగమై
అతడు:
వెలిసిన నీలి అంబరం విహారమై
ఆమె:
మోహాలన్నీ దాహం వేసే
మోహరించగా
అతడు:
చిరుముద్దుతోనే ఇచ్చుకున్న
మెుదటి తీపి ఙ్ణాపిక
ఆమె: అవునా
అతడు:
నీ వయస్సుకో నమస్సు నిత్యమల్లికా
ఆమె:
నా మనస్సులో ఉషస్సు నవ్యగీతికా
అతడు: తేనెలా తీయగా
ఆమె: ప్రాయమే పాడగా
అతడు:
మనసంతా రాగవనం
క్షణక్షణం రసార్పణం
ఆమె: అవునా
0 కామెంట్‌లు