చిత్రం: నాటకాల రాయుడు (1969)
సంగీతం: జి.కె.వెంకటేష్
రచన: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల

 

వేళచూడ వన్నెలాయె
లోనచూడ వెచ్చనాయె
ఎందుకోమరి తెలియదాయె
రేయి మాత్రం గడచిపోయె
వేళచూడ వెన్నెలాయె
లోనచూడ వెచ్చనాయె
ఎందుకోమరి తెలియదాయె
రేయి మాత్రం గడచిపోయె
కొమ్మకొమ్మకు చిగుళ్లాయె
గుండె నిండా గుబుళ్లాయె
కొమ్మకొమ్మకు చిగుళ్లాయె
గుండె నిండా గుబుళ్లాయె
పువ్వు పువ్వున తుమ్మెదాయె
పొంగు వయసుతో పోరులాయె
ఎందుకో మరి తెలియదాయే 
రేయి మాత్రం గడాచిపోయే 
కునుకుపడితే ఉలికిపడుటాయె
కునుకుపడితే ఉలికిపడుటాయె
మెలుకువైతే కునుకు రాదాయె
వల్లమాలిన వగలతోటే
భళ్ళు భళ్ళున తెల్లవారె
ఎందుకో మరి తెలియదాయే 
రేయి మాత్రం గడాచిపోయే 
సరసమెరుగని చందమామ
చాటుమాటుగ సాగిపోయే
సరసమెరుగని చందమామ
చాటుమాటుగ సాగిపోయే
వెంటనున్న చుక్క కన్నె
జంటవుండీ ఒంటరాయె
ఎందుకో మరి తెలియదాయే 
రేయి మాత్రం గడాచిపోయే
వేళచూడ వెన్నెలాయె
లోనచూడ వెచ్చనాయె
ఎందుకోమరి తెలియదాయె
రేయి మాత్రం గడచిపోయె