అల్లిబిల్లి కలలా రావే | Allibilli Kalalaa Rave | Chettu Kinda Pleader | melody songs lyrics | Balu Songs Lyrics

చిత్రం:-చెట్టుకింద ప్లీడర్

రచన:-సిరివెన్నెల

సంగీతం:-ఇళయరాజా

గానం:-S.P.బాలు,K.S.చిత్ర


అతడు

అల్లిబిల్లి కలలా రావే

అల్లుకున్న కధలా రావే

అల్లిబిల్లి కలలా రావే

అల్లుకున్న కధలా రావే

మల్లెపూల చినుకై రావే

పల్లవించు పలుకై రావే

వేచే ఎదలో వెలుగై రావే


ఆమె

అల్లిబిల్లి కలలా రానా

అల్లుకున్న కధలా రానా

మల్లెపూల చినుకై రానా

పల్లవించు పలుకై రానా

వేచే ఎదలో వెలుగై రానా


అతడు

అల్లిబిల్లి కలలా రావే

అల్లుకున్న కధలా రావే

అల్లిబిల్లి కలలా


అతడు

సోగకళ్ళ విరిసే సొగసే గోగుపూలు కురిసే

రాగమైన పిలుపే తెలిపే మూగ గుండె వలపే


ఆమె

రెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగిసే

నిన్న కన్న కలలే నేడు నిన్ను కోరి నిలిచే


అతడు

ఏలబిగువా ఏలుకొనవా ప్రేమకధ వినవా


ఆమె

అల్లిబిల్లి కలలా రానా

అల్లుకున్న కధలా రానా

అల్లిబిల్లి కలలా


ఆమె

ఆఅఆఅ...ఆఅఆఅ..

ఆఅఆఅ...ఆఅఆఅ..


అతడు

జావళీలు పాడే జాణ జాబిలమ్మ తానై

గుండె నిండిపోయే చానా వెండిమబ్బు తానై


ఆమె

సంగతేదో తెలిపే తలపే సంగతులు పలికే

దూరమింక చెరిపే వలపే దోరనవ్వు చిలికే


అతడు

మేనికుళుకే తేనెచినుకై పూలజల్లు కురిసే


అతడు

అల్లిబిల్లి కలలా రావే

అల్లుకున్న కధలా రావే


ఆమె

అల్లిబిల్లి కలలా రానా

అల్లుకున్న కధలా రానా


అతడు

మల్లెపూల చినుకై రావే

పల్లవించు పలుకై రావే


ఆమె

వేచే ఎదలో వెలుగై రానా


అతడు

అల్లిబిల్లి కలలా రావే

ఆమె

అల్లుకున్న కధలా రానా


అతడు

అల్లిబిల్లి కలలా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు