- చిత్రం: గోదారి గట్టు పైన
- గానం: హరిణి
- సంగీతం: నాగ వంశీ
- సాహిత్యం: దినేష్ కాకర్ల
- నటీనటులు: సుమంత్ ప్రబాష్, నీది ప్రదీప్
పల్లవి:
తాకి తాకగానే తన ఛాయే కరకుగా
లోలో కలిగినదే... తొలి ప్రేమే మృదువుగా
ఉవ్వెత్తున ఉప్పొంగిన...
ఆ అలే ఎగిసె మనసున
పోటెత్తిన పొంగొచ్చిన...
ఆ గోదారిలో మునిగిన
ప్రేమల సంద్రం లోన...
నావై తేలనే
కోరస్:
చూడు చూడు చుట్టూ అంతా...
ప్రేమ ఉప్పెనొచ్చి ముంచినంత
ఉన్నట్టుండి లోకమంతా...
ప్రేమ రంగులద్దుకున్న వింత
చరణం:
మండుటెండ లాంటి గొడవలో పరిచయమే
మోసుకొచ్చె వసంతమే... ఇదేం చిత్రమే
కారణాలు అసలు అడగని కలయికనే
దారమై ముడిసెనే... చిరో సగమునే
అంతులేని హాయి వరంలా...
అల్లుకుంది ప్రేమ స్వరంలా
దాచి ఉంచలేను ఇలాగ...
బయట పెట్టలేను ఎలాగ
ప్రేమల సంద్రం లోన... నావై తేలనే
కోరస్:
చూడు చూడు చుట్టూ అంతా...
ప్రేమ ఉప్పెనొచ్చి ముంచినంత
ఉన్నట్టుండి లోకమంతా...
ప్రేమ రంగులద్దుకున్న వింత
