Shivaham Bharani Song Lyrics In Telugu | Private Album Songs Lyrics In Telugu

 శివోహం - శివరాత్రి ప్రత్యేక గీతం








వివరాలు:
 * గానం: యశో కృష్ణ
 * రచన: తనికెళ్ళ భరణి
 * సంగీతం: సాకేత్ కోమండూరి



పల్లవి:
శివోహం శివోహం శివోహం శివా
(శివోహం శివోహం శివోహం శివా)
శివోహం శివోహం శివోహం శివా
శివా ఓం శివా ఓం శివా ఓం శివా
అటు ఇటు నీవేరా అఖిలేశ్వరా
ఎటు చూసినా నువ్వే ఎదుటేశ్వరా
పాహి పాహి పరమేశ్వరా
జగమంతా నీవేరా జగదీశ్వరా
ఈ జగమంతా నీవేరా జగదీశ్వరా
శివోహం శివోహం శివోహం శివా
శివా ఓం శివా ఓం శివా ఓం శివా
చరణం 1:
నీ కంటి చలువలే వెన్నెలలు ఈవేళ
నీ కనుల వెలుగులే వేసవులు ఏవేళ
నీ నయన వాత్సల్యమే వాన జల్లులై
నీ నటనలే జీవ సంఘటనలై
నీ వదనమే ఉదయ రవి బింబమై
ఈ భువికి నీ ఉనికి ప్రతిబింబమై
లోకాలు కాపాడే లోకేశ్వరా
(నువ్వు లేని తావేది అణువణువు శివవేది)
అటు ఇటు నీవేరా అఖిలేశ్వరా
ఎటు చూసినా నువ్వే ఎదిదేవరా
చరణం 2:
జలగంగ జడలోన విషము గొంతుకలోన
నుదుటిలో నిత్యాగ్ని జ్వాలలను దాచుకొని
పార్వతిని నీ మేని సగపాలు చేసుకొని
మనుజులకు దాంపత్య మనుగడను నేర్పావు
దేవతలకి ఆదిదేవుడివి అయినావు
భూతలముకే దివ్య భూమికవి అయినావు
లోకాలు కాపాడే లోకేశ్వరా
నువ్వు లేని తావేది అణువణువు శివవేది
అటు ఇటు నీవేరా అఖిలేశ్వరా
ఎటు చూసినా నువ్వే ఎదిదేవరా
చరణం 3:
ఏనుగును కనినప్పుడు గణపతి అనిపించు
నెమలిని కనినా నీ కుమారుడే కనిపించు
పాము ఎలుకలను నీవు ఒక నిలవులో నిలిపి
ప్రతి జీవిలో ఉన్న పరమాత్మ నీవని
ఓంకారమున నీవు సాకారమైనావు
ఓనమాలకు నీవు శ్రీకారమైనావు
లోకాలు కాపాడే లోకేశ్వరా
జగదీశ్వరా జగమంత నీవేరా జగదీశ్వరా
జగదీశ్వరా జగమంత నీవేరా జగదీశ్వరా

This lyrics are for educational and promotional purpo

ses only.
All rights belong to the respective owners.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు