చిత్రం : తాజ్ మహల్ (2010)
సంగీతం : అభిమాన్ రాయ్
రచన : భాస్కరభట్లరవికుమార్
గానం: కార్తీక్
నీ మీదే మనసు పడీ
మారిందే గుండె సడీ
నీవల్లే నిదుర చెడీ
లేచానే ఉలికి పడీ
నిన్నే నిన్నే చూడాలని ఉందే
నీతో ఏదో చెప్పాలి ఉందే
నా కళ్ళు వెతికాయి నిన్నే
వెన్నెలలో వేకువలో
నా కళ్ళూ వెతికాయి నిన్నే
వెన్నెలలో వేకువలో
నీమీదే మనసు పడీ
మారిందే గుండె సడీ
మునిగిందిలే మది నీ ధ్యాసలో
తేలదు కదా ఇక ఈ జన్మలో
మునిగిందిలే మది నీ ధ్యాసలో
తేలదు కదా ఇక ఈ జన్మలో
హృదయాలనే జత కలిపేందుకూ
వలపన్నదే కద ఒక వంతెనా
మౌనమా కొంచెం మాటాడమ్మా
ఈ దూరమే కొంచెం తగ్గించమ్మా
మౌనమా కొంచెం మాటాడమ్మా
ఈ దూరమే కొంచెం తగ్గించమ్మా
నా కళ్ళు వెతికాయి నిన్నే
వెన్నెలలో వేకువలో
నా కళ్ళూ వెతికాయి నిన్నే
వెన్నెలలో వేకువలో
నీమీదే మనసు పడీ
మారిందే గుండె సడీ
చిరుగాలిలా నువ్వు వస్తావనీ
తెచ్చానులే పూల గంధాలనీ
చిరుగాలిలా నువ్వు వస్తావనీ
తెచ్చానులే పూల గంధాలనీ
ప్రతిరోజు నీకై ఆలోచనా
వినిపించదా నా ఆలాపనా
ఊరికే నను వేధించకా
చిరునవ్వుతో చెలి కరుణించవా
ఊరికే నను వేధించకా
చిరునవ్వుతో చెలి కరుణించవా
నా కళ్ళు వెతికాయి నిన్నే
వెన్నెలలో వేకువలో
నా కళ్ళూ వెతికాయి నిన్నే
వెన్నెలలో వేకువలో
నీమీదే మనసు పడీ
మారిందే గుండె సడీ
నీవల్లే నిదుర చెడీ
లేచానే ఉలికి పడీ
నిన్నే నిన్నే చూడాలని ఉందే
నీతో ఏదో చెప్పాలి ఉందే
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.

0 కామెంట్‌లు