Nanuganna Naa Thalli Song Lyrics in Telugu | శ్రీరాములయ్య | వందేమాతరం శ్రీనివాస్ | గోరటి వెంకన్న | యస్.పి. బాలు, చిత్ర


చిత్రం: శ్రీరాములయ్య (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గోరటి వెంకన్న

గానం: యస్.పి. బాలు, చిత్ర



అతడు  

ఓఓఓఓ ఓఓ ఓఓ 

ఓ ఓ ఓ ఓఓఓ 

నను గన్న నా తల్లి 

రాయలసీమ రతనాల సీమ 

తనువెళ్ల తరగని 

ఘనులున్న సీమ గిరులున్న సీమ 

నను గన్న నా తల్లి 

రాయలసీమ రతనాల సీమ 


ఇద్దరు 

తనువెళ్ల తరగని 

ఘనులున్న సీమ గిరులున్న సీమ


అతడు 

వానగాలికి సీమ తానమాడినపుడు 

వజ్రాలు ఈ నేల వంగిపై తేలాడు 

పొరలు నిమిరితే పుష్య

రాగాలు దొర్లు రాగాలు దొర్లు 

బంగారు ఘనులున్న కుంగదీ తల్లీ 

పొంగి పోదమ్మా


ఆమె 

కలియుగంబున నరులు 

ఓర్వలేరని తెలిసి 

నల్ల రాయై వెలసి ఎల్లలోకములేలు 

వెంకటాచలము భువైకుంఠ స్థలమో 

వైకుంఠ స్థలము దర్శించినా నాజన్మ 

ధాన్యమౌతాదో పుణ్యమౌతాదో


అతడు  

నను గన్న నా తల్లి 

రాయలసీమ రతనాల సీమ 


ఇద్దరు 

తనువెళ్లి తరగని 

ఘనులున్న సీమ గిరులున్న సీమ


అతడు  

హరిహరభుక్తరాయ అడివి వేటాకెళితే 

కుందేళ్లు కుక్కల ఎంటబడ్డాయంట 

పౌరుషాల పురిటి జీవగడ్డమ్మో జీవగడ్డమ్మో 

ప్రతినబట్టిన శత్రువిక పతనమేరా 

ఇక పతనమేరా 


ఆమె 

పాపాలు కడిగేటి పాతాళ గంగమ్మ 

ఆధి గురువుల తపము 

నాచరించెను బిలము 

హటకేశ్వర శిఖరమవని కైలాసం 

అవని కైలాసం 

తనుకుతా వెలసిన

శివలింగమమ్మో శ్రీ శైలముమ్మా


అతడు  

నేను గన్న నా తల్లి 

రాయలసీమ రతనాల సీమ 


ఇద్దరు 

తనువెళ్ల తరగని 

ఘనులున్న సీమ గిరులున్న సీమ


ఆమె 

ఇయ్యారే ఇయ్యారే ఇయ్యారే.. 

ఇయ్యారేఇయ్యారే  

ఇయ్యారే ఇయ్యారే ఇయ్యారే..

సత్రాలు సాధువులు 

భైరాగి తత్వాలు సీమ ఊరూరున 

మారు మ్రోగుతాయి 

శిథిలమైన గుళ్ళు

శివనందులమ్మో శివనందులమ్మో 

వీరబ్రహ్మం ముఠము 

సీమకే మఖుటం సీమకే మఖుటం

 

అతడు 

పాలబుగ్గల నోట వేణువు మీటితే 

ఆలమందలు కంచె బీళ్లు పరవశించు 

నింగిలో చంద్రుడు

తొంగిచుసితే తొంగిచుసితే 

సీమలో కోలాటమే 

సిందుతొక్కు చిరుగజ్జలాడు

నను గన్న నా తల్లి 

రాయలసీమ రతనాల సీమ 


ఇద్దరు 

తనువెళ్ల తరగని 

ఘనులున్న సీమ గిరులున్న సీమ



అతడు 

ఎత్తు బండరాళ్లు ఎర్రని దుప్పులు 

పనుగు రాళ్ళ గట్లు పరికి కంపపొదలు 

నెర్రెడ్డు వారిన నల్లరేగళ్ళు నల్లరేగళ్ళు 

ఆరు తడుపుకు పెరిగే 

వేరు సేనగమ్మా వేరు సేనగమ్మో 


ఆమె 

నల్లమల్లడవుల్లో తెల్లబారే పొద్దు 

అంబకేలకి సీమ మీదగ్గి కురిపించు 

సందేపూట నుండి 

కొండ నీడలో కొండ నీడలో 

సల్లగాలికి ఒళ్ళు మరచి నిదురించు 

అలసి నిదురించు


అతడు 

నను గన్న నా తల్లి 

రాయలసీమ రాతనాల సీమ 

తనువెళ్ల తలుగాని  

ఘనులున్న సీమ గిరులున్న

 

ఆమె 

సీమ నను గన్న నా తల్లి 

రాయలసీమ రతనాల సీమ 

తనువెళ తరగని 

ఘనులున్న సీమ గిరులున్న సీమ 


అతడు 

ఓహో... ఓ ఓ ఓ... 

ఆహా హా హా ఓహేహా ఓ


This lyrics are for educational and promotional purposes only.

All rights belong to the respective owners.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి