Nuvvunte Chaley - Lyrical in Telugu | Andhra KingTaluka | Ram Pothineni | Bhagyashri Borse |Mahesh Babu P |

చిత్రం: ఆంధ్ర కింగ్ తాలుకా 
గానం: అనిరుద్ రవిచంద్ర 
సంగీతం: వివేక్, మార్విన్ 
సాహిత్యం: రామ్(హీరో)
నటీనటులు: రామ్, భాగ్యలక్ష్మి 


పల్లవి:
ఒక చూపుతో నాలోనే పుట్టిందే
ఏదో వింతగా గుండెలో చేరిందే
నువ్వెవ్వరో నాలో అని అడిగానే
తానేగా ప్రేమని తెలిపిందే
పరిచయం లేదని అడిగా ప్రేమంటే
కలిసాక ఇకపై మనమేగా అందే
వెతికినా దొరకని అర్థం ప్రేమదే
అది నీకేంటో ఒక మాటలో చెప్పలే
నువ్వుంటే చాలే...
నువ్వుంటే చాలే...
నువ్వుంటే చాలే...
 చరణం1:
మాటలతో చెప్పమంటే చెప్పలేనే
భావమేదో భాషలకే అందనందే
అదేమిటో కుదురుగా ఉండలేనే... నువ్వుంటే
అడిగితే అదేమిటో అర్థం కాదే
నిన్న మొన్న నాలో ఉన్న నేనే కాదే
పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే... ప్రేమంటే
 చరణం 2
దారే లేని ఊరినే అడిగానుగా
నువ్వేగా దారని నాకు చూపుతుంది
కమ్ముకున్న మబ్బులో వెతికానుగా
అరె గాలి వానై నన్ను తాకుతుంది
నాకే తెలియని నాలో యుద్ధమా
లోలోన సంద్రమా...
లేదే పొంగుతున్నదే ఇంకేదో
పేరు లేదుగా... ఇంతే మారదుగా
అంతే ఒప్పుకో మరి వింతలే 
Chorus:
నువ్వుంటే చాలే...
మాటలతో చెప్పమంటే చెప్పలేనే
భావమేదో భాషలకే అందనందే
అదేమిటో కుదురుగా ఉండలేనే... నువ్వుంటే
అడిగితే అదేమిటో అర్థం కాదే
నిన్న మొన్న నాలో ఉన్న నేనే కాదే
పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే... ప్రేమంటే

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు