Nirantharamu Vasanthamule Song Lyrics in Telugu | నిరంతరమూ వసంతములే | Preminchu Pelladu | Ilaiyaraaja | S. P. Balu | Janaki | ప్రేమించు పెళ్ళాడు



ప్రేమించు పెళ్ళాడు,

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలు, యస్.జానకి



పల్లవి:
అతడు
నిరంతరమూ వసంతములే 
మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే
పదాలు ఫలాలుగ పండే
నిరంతరము వసంతములే 
మందారములా మరందములే
ఆమె
నిరంతరమూ వసంతములే 
మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే
పదాలు ఫలాలుగ పండే
నిరంతరము వసంతములే 
మందారములా మరందములే

చరణం: 1
ఆమె
హాయిగా పాట పాడే కోయిలే మాకు నేస్తం
అతడు
తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం
ఆమె
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం
అతడు
అలలపై నాట్యమాడే వెన్నెలే వేణుగానం
ఆమె
ఆకశానికవి తారలా
అతడు
ఆశకున్న విరి దారులా
ఆమె
ఈ సమయం ఉషోదయమై 
మా హృదయం జ్వలిస్తుంటే
నిరంతరమూ వసంతములే 
మందారములా మరందములే
అతడు
స్వరాలు సుమాలుగ పూచే
పదాలు ఫలాలుగ పండే
నిరంతరము వసంతములే 
ఆమె
మందారములా మరందములే
చరణం: 2
అతడు
అగ్నిపత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయే
ఆమె
మెరుపులేఖల్లు రాసి మేఘమే మూగవోయే
అతడు
మంచు ధాన్యాలు గొలిచి పౌష్యమే వెళ్ళిపోయే.. 
ఆమె
మాఘ దాహలలోనా అందమే అత్తరాయే
అతడు
మల్లె కొమ్మ చిరునవ్వులా
ఆమె
మనసులోని మరుదివ్వెలా
అతడు
ఈ సమయం రసోదయమై 
మా ప్రణయం ఫలిస్తుంటే
నిరంతరమూ వసంతములే 
మందారములా మరందములే
ఆమె
స్వరాలు సుమాలుగ పూచే
పదాలు ఫలాలుగ పండే
నిరంతరము వసంతములే 
అతడు
మందారములా మరందములే

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు