abhinava sashirekhavo song lyrics in telugu | అభినవ శశిరేఖవో, గృహప్రవేశం

 



అతడు 
అభినవ శశిరేఖవో
ప్రియతమ శుభలేఖవో
అభినవ శశిరేఖవో ఓ..ఓ..ఓ 
ప్రియతమ శుభలేఖవో
ఆ తొలి చూపు కిరణాల
నెలవంక నీవో
ఆమె
నవయువ కవిరాజువో
ప్రియతమ నెలరాజువో
నా కనుదూయి కమలాల
భ్రమరమ్ము నీవో
నవయువ కవిరాజువో ఓ..ఓ..ఓ 
ప్రియతమ నెలరాజువో
అతడు 
ఆ కనులు ఇంద్ర నీలాలుగా
ఈ తనువు చంద్ర శిఖరాలుగా
కదలాడు కల్యాణివే ఏ..ఏ..ఏ 
ఆమె
నా హృదయం మధుర సంగీతమై
కల్యాణ వీణ స్వరగీతమై
శ్రుతి చేయు జతగాడివే 
అతడు 
ఆ జతలోన వెతలన్ని చల్లార్చవే
ఆమె
నవయువ కవిరాజువో ఓ..ఓ..ఓ 
అతడు
అభినవ శశిరేఖవో ఓ..ఓ..ఓ 
ఆమె
 నా వయసు వలపు హరివిల్లుగా
నవపారిజాతాల పొదరిల్లుగా
రావోయి రవిశేఖరా ఆ..ఆ..ఆ 
అతడు
 తొలి సంధ్య మధుర మందారమే
నీ నుదిటి తిలక సింగా....రమై
నూరేళ్ళు వెలిగించనా
ఆమె
నా నూరేళ్ళ నెలవళ్ళు కరిగించనా
అతడు: అభినవ శశిరేఖవో
ఆమె: ఆ..ఆ..ఆ 
అతడు: ప్రియతమ శుభలేఖవో
ఆమె: ఆ..ఆ..ఆ 
అతడు: ఆ తొలి చూపు కిరణాల
నెలవంక నీవో
ఆమె: నవయువ కవిరాజువో 
అతడు: ఆ..ఆ..ఆ 
ఆమె:ప్రియతమ నెలరాజువో
అతడు: ఆ..ఆ..ఆ 
ఆమె: నా కనుదూయి కమలాల
భ్రమరమ్ము నీవో
అతడు: అభినవ శశిరేఖవో
ఆమె: ఆ..ఆ..ఆ 
ప్రియతమ నెలరాజువో
అతడు: ఆ..ఆ..ఆ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి