చిత్రం : అతిధి (2007)
సంగీతం : మణిశర్మ
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : దీపు, ఉష
సంగీతం : మణిశర్మ
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : దీపు, ఉష
పల్లవి :
అతడు
సత్యం ఏమిటో
స్వప్నం ఏమిటో
చెప్పేదెవరు ఏ కంటికైనా
రెప్పలదుప్పటి కప్పే చీకటి
చూపించేనా ఏ కాంతినైనా
ఆమె
నిను నీవే సరిగా
కనలేవే మనసా
అతడు
నడిరాతిరి నడకా కడతేరదు తెలుసా
ఏవో జ్ఞాపకాల సుడిదాటి బైటపడలేవా
ఎన్నో తీపి సంగతుల
రేపు పిలుపు వినలేవా
చరణం : 1
అతడు
చంద్రుడి ఎదలో మంటని
వెన్నెల అనుకుంటారని
నిజమైనా నమ్మేస్తామా
భ్రమలో పడమా తెలిసీ
జాబిలిని వెలివేస్తామా
తనతో చెలిమే విడిచీ
రూపం లేదు గనక సాక్ష్యాలు
అడిగి ఎవరై..నా
ప్రాణం ఉనికి పైన
అనుమానపడరు ఎపుడై...నా
ఆమె
నిను నీవే సరిగా కనలేవే మనసా
అతడు
నడిరాతిరి నడకా కడతేరదు తెలుసా
చరణం : 2
అతడు
పోయింది వెతికే వేదనా
ఉంటుంది ఏదో పోల్చునా
సంద్రంలో ఎగిసే అలకి
అలజడి నిలిచేదెపుడో
సందేహం కలిగే మదికి
కలతను తీర్చేదెవరో
శాపంలాగ వెంట
పడుతున్న గతం ఏదై...నా
దీపంలాగ తగిన దారేదో
చూపగలిగే....నా

0 కామెంట్‌లు