గింజ గింజ గింజ మీద
బుసుక బుసుక బుసుక తీసి
తియ్యంగా బత్తెమై పోయే
బొట్టే కట్టి చేతబట్టిన
చేతిలోకి చేరాలని
గుండు జల్లారాట పడిపోయే
అతడు
ఓఓ ఓబులమ్మా
బొమ్మకర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ
కపర కపర రేతిరిలోనా
కాలమంతా లెక్కలుగట్టి
గుండెలోనే నీ పేరు జపమాయే
ఇదివరకెపుడూ తెలియని ఎరగని
తురుపే మైమరపిస్తూ ఉంటే
కంటికేమో కునుకే దూరపు చుట్టమాయే
అతడు
కన్నులు కన్నులు వింటున్న
చూపులు చూపులు చెబుతున్న
మాటల మాటలు చూస్తున్న మగతలలో
ఎవ్వరికెవ్వరు సావాసం
ఎక్కడికక్కడ ప్రయాణం
ఎప్పటికప్పుడు ఎదురయ్యే మలుపులలో
ఆమె
చదివేశాడేమో నా కలలూ
ఉంటాడే నీడై రేపవలు
తిష్టేసినాడే గోంతరాలు
పొమ్మంటే పోడే ఈడిగలు
అతడు
ఓఓ ఓబులమ్మా
పుట్టచెండు ఆటల్లోన పూలకొమ్మ
ఆమె
కపర కపర రేతిరిలోనా
కాలమంతా లెక్కలు తప్పి
గుండెలోనే నీ పేరు జపమాయే
ఇదివరకెపుడూ తెలియని ఎరగని
తలపే మైమరపిస్తూ ఉంటే
కంటికేమో కునుకే దూరపు చుట్టమాయే
అతడు
ఓఓ ఓబులమ్మా
బొమ్మకర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ
ఓఓ ఓబుళమ్మా
పుట్టచెండు ఆటల్లోన పూలకొమ్మ
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.

0 కామెంట్‌లు